బీర్కూర్ మండలం వైఎస్ఆర్ కాలనీ సమస్యలు… ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి గంగపుత్ర సభ్యుల వినతిపత్రం

బాన్సువాడ, నవంబర్ 26(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలో ప్రాథమిక సౌకర్యాల లేమి కారణంగా ఎదురవుతున్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గంగపుత్ర సంఘ సభ్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.కాలనీవాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాలనీ ఏర్పడి 14 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిచేయకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడల్లా కాలనీలో మురికినీళ్లు నిలిచిపోయి దోమల పెరుగుదల, పందుల సంచారం, దుర్వాసన వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుక, ఇసుక వంటి నిర్మాణ సామగ్రిని తీసుకురావడమూ కష్టంగా మారింది. గుంతలతో నిండిన రహదారుల కారణంగా వాహనాలు ఇరుక్కుపోవడం తరచూ జరుగుతోందని వారు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, కాలనీ ప్రాథమిక సదుపాయాలైన రోడ్లు మరియు డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోచారంను గంగపుత్ర సభ్యులు, కాలనీ వాసులు కోరారు.

Views: 59
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు