బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు

బీర్కూర్, మే 07(డిడి9 వార్త):

కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏక చక్రేశ్వర గోశాల లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 వేల గడ్డి కట్టలు దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ ఘటన గురించి గోసేవకుడు సితలే రమేష్ ద్వారా తెలుసుకున్న బీర్కూర్ గ్రామ యువకులు స్పందించి గోశాలకు పశుగ్రాసం సహాయం అందించారు.

బీర్కూర్ గ్రామానికి చెందిన గోసేవ దాతలు పిట్లం అశోక్ (బంగారం), శశికాంత్ కలిసి సుమారు రూ.25 వేల విలువైన 350 గడ్డి కట్టలను బోధన్ ఏక చక్రేశ్వర గోశాలకు పంపించారు.ఈ సేవా కార్యక్రమంలో గోసేవకులు సితలే రమేష్, శశికాంత్, కిట్టు, మెకానిక్ నాగు, శేఖర్, జూకంటి మల్లేష్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. గోశాలకు అవసర సమయంలో సహాయం అందించిన దాతలను గోసేవకులు అభినందించారు.

Views: 117
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు