కేంద్ర నిధులతో నడిచే గ్రామ పంచాయతీల్లో ప్రధాని మోడీ చిత్రపటం లేకపోవడం దురదృష్టకరం: ఎంపీడీవోకు బీజేపీ వినతిపత్రం
బీర్కూర్,జనవరి 29(డిడి9 వార్త):
గురువారం స్థానిక ఎంపీడీవోని బీజేపీ మండల నాయకులు కలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్ఈజీఎస్,15వ ఫైనాన్స్ కమిషన్ కింద సుమారు 80 శాతం నిధులు వస్తున్నప్పటికీ, గ్రామ పంచాయతీలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్ అన్నారు.వెంటనే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంమే నిధులు ఇస్తుందని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.గ్రామ పంచాయతీలలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయని పక్షంలో, బీజేపీ కార్యకర్తలే స్వయంగా ప్రతి గ్రామ పంచాయతీలో చిత్రపటాలను ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొంతల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు హనుమాన్లు, నూకల రాము, బీజేపీ సీనియర్ నాయకులు పోచుగొండ, సాయిబాబా, మనోజ్, పండరి, ప్రవీణ్‌తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

