తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక

ఖిల్లా మైసమ్మ, మహంకాళి అమ్మవార్లకు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు

IMG-20260809-WA0082కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 9(డిడి9 వార్త): ఆషాఢమాస బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అనంతరం జియాగూడ సబ్జీ మండి మహంకాళి ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో గజరాజు గజమాలతో పోచారం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వదిస్తూ స్వాగతం పలికింది.ఈసందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని అన్నారు.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి