బోధన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

విజయ సాయి పాఠశాలలో ఆకట్టుకున్న తెలుగు భాషా ప్రదర్శన

బోధన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

IMG-20260806-WA0203

బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​అనంతరం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 115 రకాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల నుంచి ఛందస్సు వరకు భాషా విశేషాలను ప్రదర్శించారు. తెలంగాణ మాండలిక పదాలు, ఆటల ద్వారా అక్షరాల కూర్పు, సామెతలు, భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థుల తెలంగాణ తల్లి, రాముడు, సీత, లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల, తెలుగు విభాగ అధిపతి శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

IMG-20260806-WA0202

 

Views: 7
Tags:

About The Author

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి