మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు

IMG-20260809-WA0035

బాన్సువాడ, ఆగస్టు 09(డిడి9 వార్త): బీర్కూర్ స్కూల్‌లో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు ఆరె అనిల్ తండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న మిత్రులు మానవత్వంతో ముందుకొచ్చారు.తమ వంతు సహాయంగా తోటి మిత్రులందరూ కలిసి రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపద సమయంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. కష్టకాలంలో తోటి మిత్రుడికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అవారి ప్రవీణ్, బాయిని శ్రీకాంత్, మేర భరత్, గన్నారం కిరణ్, నారం హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 350
Tags:

About The Author

Related Posts

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి