మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
అక్రమంగా తరలిస్తున్న బొలేరో స్వాధీనం
By R.Suresh
On
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్ నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అజ్మత్ నావజ్ వెల్లడించారు. తగ్గెల్లి వద్ద మంజీరా నది తీరం నుంచి నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళ ఇసుక తోడుతూ వాహనంలోకి ఎక్కిస్తున్నారనే పక్కా సమాచారం ఆర్‌ఐ శంకర్‌కు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా క్షేత్రస్థాయికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. తగ్గెల్లి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడుతో బోధన్ వైపు వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఆర్‌ఐ స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ అజ్మత్ నవాజ్
ఈ సందర్భంగా తహసీల్దార్ అజ్మత్ నవాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తోడినా, తరలించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతామని, రాత్రి వేళల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు.
Views: 64
Tags:
About The Author
Latest News
12 Aug 2026 09:40:13
బోధన్ మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని...

