హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి

హన్మాజీపేట్‌లో అంగరంగ వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

IMG-20260809-WA0016బాన్సువాడ, ఆగస్టు 09(డిడి9 వార్త): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం కామారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కొంకి గణేష్ మాట్లాడుతూ జల్.. జంగల్.. జమీన్ కోసం ఆదివాసీలు సాగించిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.ఆదివాసీల హక్కులు, గుర్తింపు కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించిందన్నారు.ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఆదివాసీ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక వసతుల విషయంలో ఆదివాసీ గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావణ్య వెంకగౌడ్, ఏర్రవట్టి సాయిబాబా, ఉపసర్పంచ్ బాబ్యా నాయక్, సంజీవ్, వార్డు సభ్యులు కొంకి సుశీల, బాలరాజు, తుకారాం, బాగయ్య, ఆదివాసీ నాయకపోడు గ్రామ అధ్యక్షుడు శంకర్, పెంకటి గణేష్, సుభాష్, గంగాధర్, సాయిలు, కుల పెద్దలు, ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 28
Tags:

About The Author

Related Posts

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి