ప్రజాసేవే లక్ష్యంగా.. ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు

రోగులకు పండ్ల పంపిణీ.. ప్రజల కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్ష

IMG-20260808-WA0026బాన్సువాడ, ఆగస్టు 08(డిడి9 వార్త): ప్రజాసేవకు అంకితమై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను బాన్సువాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్వగృహంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎంపీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా ప్రజాసేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఎంపీ సురేష్ షెట్కర్ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని నాయకులు ఆకాంక్షించారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బిన్ మోసీన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్, షాహబ్, రవీందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, గుడాల నగేష్, కొట్టం గంగాధర్, గోపాల్ రెడ్డి, నార్ల రవీందర్, ఎజాజ్, హకీమ్, నర్సన్నచారి, శివదయాళ్, వెంకన్న సేట్, రమేష్, కాశీరాం, షోయెబ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

Related Posts

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి