అధికారం కోసం కొట్లాట కాదు.. విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలి

పాఠశాల ఆవరణను శుభ్రం చేసిన బీజేపీ శ్రేణులు – అధికారంలో ఉన్న నాయకులకు నాగేళ్ల సాయికిరణ్ చురకలు

IMG-20260808-WA0015~2బాన్సువాడ, ఆగస్టు 08(డిడి9 వార్త): అధికారంలో ఉన్న నాయకులు పదవులు, స్వలాభాల కోసం పరస్పరం విమర్శించుకోవడం, కొట్టుకోవడం కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బీజేపీ మండల అధ్యక్షుడు నాగేళ్ల సాయికిరణ్ అన్నారు. ముఖ్యంగా భావి తరాలైన విద్యార్థులు చదువుకునే పాఠశాలల పరిస్థితులపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల ప్రహరీ గోడ లోపల, కిటికీల వద్ద పెరిగిన గడ్డి, పొదలు, ఇతర అపరిశుభ్రతను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామయువకులు తొలగించారు.వర్షాకాలం కావడంతో పాఠశాల పరిసరాల్లో పాములు, విషపూరితమైన పురుగులు సంచరించే ప్రమాదం ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు సాయికిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు అధికారం అవసరం లేదు.. ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యం.అధికారంలో ఉన్నవారు పదవుల కోసం, స్వలాభాల కోసం ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు. పాఠశాలల్లో పిల్లలకు కనీస సౌకర్యాలు ఉన్నాయా? పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా? విద్యార్థులకు రక్షణ ఉందా? అనే విషయాలను ముందుగా పట్టించుకోవాలి అని అన్నారు.ప్రజల కోసం పనిచేయాల్సిన వారు రాజకీయ విమర్శలకే పరిమితమైతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? అని ప్రశ్నించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం జరిగితే చిన్న సమస్య కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని, అందువల్ల సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలలను తరచూ పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించి ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తీసుకువచ్చారని సాయికిరణ్ గుర్తుచేశారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థులు ఆరోగ్యంగా చదువుకోగలరని అన్నారు.రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే కాదు.. ప్రజల కష్టాల్లో, పిల్లల సమస్యల్లో, పాఠశాలల అభివృద్ధిలో కనిపించాలి. నాయకుల మధ్య పోటీ అభివృద్ధిలో ఉండాలి కానీ విమర్శల్లో కాదు అని సాయికిరణ్ అన్నారు.పాఠశాలల పరిశుభ్రత, విద్యార్థుల భద్రత, మౌలిక వసతులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నవీన్, శ్రీకాంత్, గంగాధర్, యువత గంగా ప్రసాద్, లక్ష్మీనారాయణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 74
Tags:

About The Author

Related Posts

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి