ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్

సమస్యను పరిష్కరించిన మియాపురం శశికాంత్‌ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి చొరవకు స్థానికుల కృతజ్ఞతలు

IMG-20260810-WA0068బాన్సువాడ, ఆగస్టు 10(డిడి9 వార్త): బీర్కూర్ పట్టణంలోని స్మశాన వాటికలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మియాపురం శశికాంత్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.స్మశాన వాటికలో నెలకొన్న విద్యుత్ సమస్యను బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.ఆయన చొరవతో స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్ మంజూరై, సోమవారం విద్యుత్ సరఫరాను పూర్తి చేశారు.దీంతో స్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం కోసం కృషి చేసిన మియాపురం శశికాంత్‌కు, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు చొరవ చూపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరమేష్, ఈవో గంగారాం, డీసీసీ సెక్రెటరీ మేకల విట్టల్,ఆత్మకమిటీ డైరెక్టర్ కుతాడి శంకర్, వార్డు మెంబర్లు కొరిమె రఘు, కొర్రీ ప్రశాంత్, ఆనంద్, నాయకులు దుంపల రాజు, అశోక్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Views: 115
Tags:

About The Author

Related Posts

Latest News

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'! మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం...
ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
బాన్సువాడలో కుక్కల బీభత్సం
మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
నకిలీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలి
హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలకు ఘన నివాళి