ప్రారంభోత్సవానికే పరిమితమైన చలివేంద్రం..!

బీర్కూర్, మే 07(డిడి9 వార్త):

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మరుసటి రోజుకే నిర్లక్ష్యానికి గురైంది.కామప్ప చౌరస్తా సమీపంలో గ్రామ సర్పంచ్ ధర్మ తేజ ప్రారంభించిన ఈ చలివేంద్రం ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది.ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న వేళ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం నిర్వహణ లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజు మాత్రమే నీటి సౌకర్యం కల్పించి, తరువాత పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన సేవలు కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నాయా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చలివేంద్రాన్ని నిరంతరం నిర్వహించే బాధ్యత ఎవరిది..? నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది..? అనే విషయాలపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Views: 55
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు