ప్రజాసేవలో నిబద్ధత, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం ఉద్యోగుల బాధ్యత-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, నవంబర్ 26(డిడి9 వార్త): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షత వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించారు. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు–కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ పరిరక్షణకు, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజాసేవలో నిబద్ధత, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడం ఉద్యోగుల బాధ్యత అని పేర్కొన్నారు.తదుపరి కార్యక్రమంలో అధికారులు కలిసి రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించడంలో తమ పాత్రను నిబద్ధతతో నిర్వర్తించేందుకు రాజ్యాంగ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజతో పాటు జిల్లా అధికారులులు పాల్గొన్నారు.

