బరంగ్ ఏడ్గిలో ఇంద్రవ్వ కుటుంబానికి కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం
బీర్కూర్,జనవరి 09(డిడి9 వార్త):
బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కల్లేటి ఇంద్రవ్వ (సంగెం) గురువారం అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని పరామర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ బీర్కూర్ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మానవీయతను చాటుకున్నారు.అంత్యక్రియల నిమిత్తం వ్యక్తిగత కారణాల వల్ల స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ, ఆయన ఆదేశాల మేరకు మృతురాలి కుటుంబానికి రూ. 5,000/- (అయిదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేసి వారి బాధను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు,నాయకులు ఇందూర్ గజేందర్, నాగుగొండ, మొండ్కారి వీరప్ప, ఫుల్కంటి హన్ముగొండ,కాదెపురం గంగారాం, గాజుల పండరి, సందుల రవి, వడ్ల నాగయ్య, గూడెం సాయిబాబు, బోయి లాలయ్య, బోయి సాయిలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాధలో ఉన్న కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.

