భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
బీర్కూర్, జనవరి 30(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బీర్కూర్ పట్టణ కేంద్రంలోని మల్లాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల మాజీ ఎంపీపీలు తిలకేశ్వరి రఘు, విజయ్ ప్రకాశ్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మండల నాయకులు మియ్యాపురం శశికాంత్ మాట్లాడుతూ, 1907 సెప్టెంబర్ 28న జన్మించి 1931 మార్చి 23న వీరమరణం పొందిన భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత విప్లవకారుడని తెలిపారు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడని, “విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదాన్ని దేశానికి అందించినవాడే భగత్ సింగ్ అని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత ప్రభావశీల విప్లవకారుల్లో ఒకడిగా నిలిచినందుకే ఆయనను ‘షహీద్ భగత్ సింగ్’గా దేశం స్మరిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ యామ రాములు, సొసైటీ మాజీ చైర్మన్ కొల్లి గాంధీ, లాడేగం గంగాధర్, సాహెబ్రావ్, హైమద్, మన్నన్, ఆరిఫ్, రాజు, వార్డు సభ్యులు ప్రశాంత్, భాస్కర్, మహేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

