బాన్సువాడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
బాన్సువాడ,నవంబర్ 26(డిడి9 వార్త): ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం బాన్సువాడ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బాన్సువాడ శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు.అతిథులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తూ “రాజ్యాంగం వర్ధిల్లాలి – జై భీమ్ – జై అంబేద్కర్” నినాదాలు చేశారు.కార్యక్రమంలో డివిజన్ నాయకులు ప్రశాంత్ కుమార్, బంగారు మైషయ్య, నేర్రే నర్సింలు, దొనకంటి ప్రవీణ్, మన్నె చిన్నసాయిలు, పోతురాజు లింగం, గైని రవి, మన్నె విట్టల్, కమ్మరి నర్సింలు, మారుతి ఆర్టీసీ, నేలకంటి గంగాధర్, గంగారాం, ఎర్రోళ్ల సాయిలు, మన్నె రమేష్, పోతురాజు సాయిలు, చిన్న గంగారాం, పి.లింగం తదితరులు పాల్గొన్నారు.

