పైనుండి వాన.. కింద సీసీ రోడ్డు పనులు.. బరంగేడ్గిలో కాంట్రాక్టర్ తీరుపై విమర్శలు

కామారెడ్డి జిల్లా బ్యూరో, జూలై 22(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో వర్షం కురుస్తున్న సమయంలోనే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో, కొందరు కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను విస్మరించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వTimePhoto_20260722_150749ర్షం పడుతుండగానే కాంక్రీట్ వేయడం వల్ల రోడ్డు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై విచారణ చేపట్టి, అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Views: 95
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు