నెల రోజులుగా నీళ్లు బంద్.. పోచారం కాలనీవాసుల ధర్నా
బాన్సువాడ, ఆగస్టు 28(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారుల,పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శుక్రవారం కాలనీవాసులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ..నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా అధికారులు,పాలకవర్గం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.

