టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
సాలూర చెకపోస్ట్ వద్ద 4 కేజీల గంజాయి పట్టివేత
By R.Suresh
On
టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ఓ వ్యక్తి బోధన్ పట్టణానికి గంజాయి సరఫరా చేసేందుకు వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం అందింది. దీంతో రూరల్ సీఐ విజయ్ బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి (65) అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని సోదా చేయగా 4 కేజీల గంజాయి లభించింది. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Views: 81
Tags:
About The Author
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

