బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
On
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఇంటిని జప్తు చేసింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నసురుల్లాబాద్ మండలం బస్వాయిపల్లికి చెందిన పిట్టల విఠల్ (28) మృతిచెందాడు.భార్య, ఐదేళ్లు, మూడేళ్ల ఇద్దరు చిన్నారులతో జీవిస్తున్న విఠల్.. ఇంటి జప్తు తర్వాత తల్లి ఇంట్లో తలదాచుకున్నాడు.ఆగస్టు 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా సీజ్ చేసిన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు.ఘటనపై నసురుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Views: 47
Tags:
About The Author
Related Posts
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

