వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం

వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం

IMG-20260829-WA0082బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):

కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శనివారం లోక కళ్యాణార్థం వరుణ యాగం, సుదర్శన యాగం ఘనంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలను నిర్వహించారు.ప్రజల సుఖశాంతులు, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాగాలను నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంభు రెడ్డి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు