ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

లయన్ నివేదన్ గుజరాతీకి రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లు

ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఆర్మూర్ పట్టణంలోని రామ్ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రముఖ సామాజిక నాయకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ ప్రెసిడెంట్, జీజీ ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీకీ వారి అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వాదాలు అందించారు.

​ఈ సందర్భంగా లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ... రాఖీ పౌర్ణమి అనేది అన్నాచెల్లెళ్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, మరియు పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన పండుగ అని కొనియాడారు. అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో మధురమైనదని పేర్కొంటూ, "మీరు మాకు రక్ష.. మేము మీకు రక్ష.. మనమందరం కలిసి ఈ దేశానికి రక్ష" అనే గొప్ప సందేశాన్ని చాటారు. ఈ పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో నివేదన్ గుజరాతీ కుటుంబ సభ్యులైన గుజరాతీ గీత, చవాన్ భావన, ఘటాడి నిర్మల, కొండల్వాడి మీరా బాయి, ప్రశాంతి, వినతి తదితరులు పాల్గొన్నారు..

Views: 6
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు