టీజీపీఏ కామారెడ్డి జిల్లా కమిటీ రద్దు
On
బాన్సువాడ, ఫిబ్రవరి 19(డిడి9 వార్త):
తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కార్యవర్గాన్ని పరిపాలనా కారణాలు, ఇతర అనివార్య పరిస్థితుల దృష్ట్యా గురువారం నుండి అమల్లోకి వచ్చే విధంగా రద్దు చేసినట్లు జిల్లా ఇంచార్జి బేగరి సాయిలు (బండ రెంజల్) తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ రద్దు అనంతరం కొత్త కమిటీ నియామకం లేదా ఎన్నికలు త్వరలో నిర్వహించబడనున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు అవసరమైన పరిపాలనా వ్యవహారాలను తాత్కాలిక బాధ్యతదారులుగా బేగరి సాయిలు, ఏరోళ్ల ప్రేమ్ కుమార్ నిర్వహిస్తారని వెల్లడించారు.అన్ని సభ్యులు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరినట్లు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకాల విజయ కుమారి ఒక ప్రకటనలో తెలిపారని ఆయన పేర్కొన్నారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

