పోచారం జన్మదినం సందర్భంగా బరంగ్ ఏడ్గిలో పండ్ల పంపిణీ
బీర్కూర్, ఫిబ్రవరి 10(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగ్ ఏడ్గి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, పోచారం శ్రీనివాస్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, చల్లగా జీవించాలని ఆకాంక్షించారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత పోచారానికే దక్కుతుందన్నారు.
బరంగ్ ఏడ్గి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ అవసరం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ నాయకుల దృష్టికి తీసుకురాగా, వెంటనే పోచారం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, నాయకులు కాదేపురం గంగారాం, గాజుల పండరి, కుమ్మరి గంగారాం, కుర్మ నాగు గొండ, ఇందూర్ గజేందర్, బోయి లాలయ్య, బసప్ప, మెక్క సాయిలు, నీరడి రాములు, గైని సాయిలు, బోయి సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు గాజుల సంతోష్, నాగమణి, మారోతి, గైని సంతోష్, అంగన్వాడీ టీచర్ అమృత, ఆయా కుమ్మరి గిర్మవ్వ తదితరులు పాల్గొన్నారు.

