బీర్కూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
బాన్సువాడ,డిసెంబర్ 30(డిడి9 వార్త):
బీర్కూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ, ఉప సర్పంచ్ పరమేష్ ముఖ్య అతిథులుగా హాజరై చీరలను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అరిగే ధర్మ తేజ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే ఐకేపీ ద్వారా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని తెలిపారు. మహిళలు స్వయం సాధికారత దిశగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మహేష్, ఐకేపీ సీసీ బుమయ్య, మెహరినీత, నాగమణి, జీవిత, హేమావతి, భాగ్య పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ, రాజు, మెక్కా రమేష్, కృష్ణ, శివ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

