ఐడిఓసి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జనవరి 03(డిడి9 వార్త):

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఐడిఓసి ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణపై జిల్లా పాలనాధికారి  ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐడిఓసి ఆవరణలోని సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ప్రధాన ఉద్యానవనం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కలెక్టరేట్ పరిసరాలు శుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండేలా రోజువారీ పారిశుధ్య చర్యలను క్రమబద్ధంగా చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, ఐడిఓసి ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలను గమనించి, ఆ ప్రదేశాల్లో వెంటనే మొక్కలు నాటాలని, వాటి సంరక్షణపై ప్రతి రోజు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడా కూడా అపరిశుభ్రతకు తావు లేకుండా చెత్త చెదారం వెంటనే తొలగించాలని స్పష్టంగా ఆదేశించారు.ఐడిఓసి ప్రాంగణాన్ని ఆదర్శంగా నిలిపేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పాలనాధికారి హితవు పలికారు.ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Views: 14
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు