జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు — నామినేషన్ కేంద్రాల్లో శాంతిభద్రతలపై దృష్టి
On
కామారెడ్డి, నవంబర్ 27(డిడి9 వార్త): గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం రామారెడ్డి, పోసానిపేట్, మాచారెడ్డి నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. నామినేషన్ల సమయంలో పూర్తి నిష్పాక్షపాతత్వం, బాధ్యత మరియు జాగ్రత్తతో డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు."శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.
Views: 56
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

