వివాదాస్పదంగా మోరంపల్లి బంజర్ సంత నిర్వహణ

వివాదాస్పదంగా మోరంపల్లి బంజర్ సంత నిర్వహణ

డిడి 9వార్త బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర సంత నిర్వహణ విషయంలో అధికారులు దోబూచులాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతిపెద్ద సంతగా పేరున్న మోరంపల్లిబంజర వారపుసంత నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారి అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రతి గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు నిర్వహించుకునేలా ఈ సంతకు వేలంపాట నిర్వహించారు. గురువారం పశువుల క్రయవిక్రయాలు, శుక్రవారం కూరగాయలు, ఇతర సరకుల క్రయ విక్రయాలు జరిగే విధంగా ఈ సంత నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ సంత వేలంపాట జరిగిన సమయంలోనే వివాదాల నడుమ ప్రతి వారం రెండు రోజుల పాటు మాత్రమే ఇక్కడ లావాదేవీలకు అనుమతులిచ్చిన అధికారులు, నిబంధ‌న‌లను కఠినంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిబంధ‌న‌లకు విరుద్ధంగా వేరే రోజుల్లో సంత కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా. చేశారు. కానీ ఈ నిబంధ‌న‌లకు వ్యతిరేకంగా ఇక్కడ సంత ప్రతి బుధవారం కూడా నిర్వహిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. గడిచిన ఐదు నెలలుగా ఇది కొనసాగుతోంది. ఈ దుస్థితిపై ఎవరైనా ప్రశ్నించినప్పుడు కాస్త హడావిడి చేస్తున్న అధికారులు, తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అదేమంటే ‘మేం నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నాం, వాళ్లు వాటిని లెక్క చేయడం లేదం’టూ అధికారులే చెప్తుండటం గమనార్హం. నోటీసులిస్తూ ఉన్నప్పటికీ నిర్వాహకులు పట్టించుకోక పోతే ఉన్నతాధికారులు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగులుతోంది. ఐదు నెలల నుంచి కొనసాగుతున్న ఈ తంతు చూస్తే అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. నిబంధ‌న‌ల గురించి వేలంపాట సమయంలో అంత తీవ్రమైన హెచ్చరికలు చేసిన అధికారులు, ఏమీ చేయకుండా చూస్తున్న తీరు పట్ల పలు అనుమానాలు, ఆరోపణలు రేకెత్తుతూ ఉన్నాయి. మోరంపల్లిబంజర వారపు సంత నిర్వహణలో నిబంధ‌న‌లకు పాతరేస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, నిబంధ‌న‌లు పాటించేలా చూడాలని, బాధ్యులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Views: 49

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు