భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన నేడు (గురువారం) శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
​చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే శక్తి స్వరూపిణిగా గజలక్ష్మి రూపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్మాతగా కీర్తిస్తూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి మూడో రోజు గజలక్ష్మి అలంకరణ అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన సేవలను శాస్త్రోక్తంగా జరిపారు.
​మరోవైపు, చిత్రకూట మండపంలో వేద పండితులు, అర్చకులు శ్రీ రామాయణ మహా పారాయణ మహోత్సవముల లో భాగంగా నేడు అయోధ్యా కాండ పారాయణం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Views: 15

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు