ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (డిడి9 వార్త):
తెలంగాణ గీతం “జయ జయహే తెలంగాణ, జయ హో తెలంగాణ” రచయితగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం తన స్వగృహంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఉదయం 7.25 గంటలకు వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.
 
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్న వయసు నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆయనకు అశువు కవిత్వం చెప్పడంలో అపారమైన నైపుణ్యం ఉండేది. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కవిత్వం, రచనలతో ప్రజల్లో జాగృతి రగిలించిన అందెశ్రీ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన వక్తగా నిలిచారు.
 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం, ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు పొందింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ. కోటి పురస్కారం ప్రకటించింది.
 
అందెశ్రీ సాహిత్య రంగంలో అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.
• 2006లో “గంగ” సినిమాకు నంది పురస్కారం
• 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
• 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
• 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం
• 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
• అలాగే లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు.
 
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన అందెశ్రీ, తెలంగాణ సాహితీ వేదికల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను సాహిత్యమాధ్యమంగా ప్రతిబింబిస్తూ, సామాన్యుడి వాణిగా నిలిచారు.
 
అందెశ్రీకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణంతో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖులు, రచయితలు, కవులు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Views: 11

About The Author

Dd news Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు