లిటిల్ హార్ట్స్ విజయంతో ఆనందంలో టీమ్ – సక్సెస్ మీట్ హైలైట్స్

 లిటిల్ హార్ట్స్ విజయంతో ఆనందంలో టీమ్ – సక్సెస్ మీట్ హైలైట్స్

ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి థియేట్రికల్‌గా విడుదలైన తొలి సినిమా “లిటిల్ హార్ట్స్” బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తూ, సోషల్ మీడియాలో అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకూ ప్రశంసలు అందుకుంటోంది.

మౌళి తనూజ్, శివానీ నాగారం ప్రధాన తారాగణంగా, సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

హీరో తనూజ్ మాట్లాడుతూ, “మేమంతా ఎంతో కష్టపడి చేసిన సినిమాకి ప్రేక్షకులు ఇంతటి స్పందన ఇస్తారని ఊహించలేదు. మొదటి రోజే రూ.2 కోట్లకు పైగా వసూళ్లు రావడం మా బడ్జెట్‌ను మించిపోయింది. ఇండస్ట్రీ నుంచి కూడా రవితేజ, నాని, బండ్ల గణేశ్ లాంటి వారు మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ, “లిటిల్ హార్ట్స్ ఒక టార్చ్‌బేరర్ సినిమా. మా మీద విశ్వాసం పెట్టుకుని కష్టపడి పనిచేసిన టీమ్ విజయం సాధించింది. కొత్తవారిని ప్రోత్సహించడంలో మా ప్రొడక్షన్ ఎప్పుడూ ముందుంటుంది. బన్నీవాసు ఈ ప్రాజెక్ట్‌కి విశేషంగా సపోర్ట్ చేశారు” అని చెప్పారు.

Views: 13

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు