కూకట్‌పల్లిలో సంచలనం – స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు హత్య కలకలం

కూకట్‌పల్లిలో సంచలనం – స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు హత్య కలకలం

హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన ఘటన కూకట్‌పల్లి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. గేటెడ్ కమ్యూనిటీ లాంటి అత్యంత సురక్షిత ప్రదేశంలోనే దారుణ హత్య జరగడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. రేణు అగర్వాల్ (50) రక్తపు మడుగులో మృతి చెందడంతో ఆ అపార్ట్‌మెంట్ వాసులు షాక్‌కు గురయ్యారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రేణు భర్త రాకేశ్ అగర్వాల్‌తో కలిసి కుటుంబం ఫతేనగర్‌లో స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దంపతులు తమ కుమారుడితో కలిసి స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. సుమారు 11 రోజుల క్రితమే ఝార్ఖండ్‌కు చెందిన హర్ష అనే యువకుడిని వంటమాన్‌గా పనిలోకి తీసుకున్నారు. ఈ కొత్తగా వచ్చిన వంటమాన్‌నే రేణు హత్య వెనుక ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాధారణంగా సురక్షితంగా భావించే అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటన జరగడంతో నివాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హర్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో నగరంలో భద్రతా చర్యలపై మళ్లీ చర్చ మొదలైంది.

Views: 14

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు