గెట్ అవుట్ కవిత..
బీఆర్‌ఎస్ నుంచి కవితకు సస్పెన్షన్ షాక్!
హైదరాబాద్:బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ బీఆర్‌ఎస్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అధిష్టానం తీవ్ర నిర్ణయం తీసుకుంటూ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది. తాజాగా కాళేశ్వరం అవినీతి, అంతర్గత కలహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీ నాయకత్వంపై నేరుగా విరుచుకుపడటం పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ పేరుతో కవితపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కవిత వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడే స్పందిస్తూ ఫార్వర్డ్ బ్లాక్స్ పార్టీ నేతలతో సమావేసమైన కేసీఆర్, పార్టీలో శాంతిభద్రతల కోసం తక్షణ చర్య అవసరమని తేల్చారని సమాచారం. దాంతో సస్పెన్షన్ నిర్ణయాన్ని అమలు చేసినట్లు తెలిసింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పరిణామం బీఆర్‌ఎస్‌లో పెద్ద కలకలం సృష్టించింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీలో క్రమశిక్షణను కాపాడుకోవడం కోసం ఇది తప్పనిసరి అయిందని నేతలు చెబుతున్నారు. కవితపై సస్పెన్షన్ తర్వాత పార్టీ భవిష్యత్ వ్యూహం ఏంటి అన్నదానిపై బీఆర్‌ఎస్ చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.
రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఈ పరిణామం రాబోయే రోజుల్లో కొత్త సమీకరణలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
*సస్పెన్షన్ లేఖలో సారాంశం ఇదే *
భరతరాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధిష్టానం ఎమ్మెల్సీ కె. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పార్టీ ప్రాధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, బి. రవీందర్ రావు లు విడుదల చేసిన ప్రకటనలో, ఇటీవలి కాలంలో పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా కవిత ప్రవర్తించటం, బీఆర్‌ఎస్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించటం వల్ల క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ సస్పెన్షన్ అమలులోకి వచ్చినట్లు లేఖలో స్పష్టంగా తెలియజేశారు.

