లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోశాలకు పశుగ్రాసం విరాళం
On
బీర్కూర్, ఫిబ్రవరి 08(డిడి9 వార్త):
ఆదివారం బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోధన్ ఏకచక్రాపుర గోశాలకు పశుసేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుగునరాం, బొగడమీద శ్యామ్, రమేష్ డాక్టర్‌లు కలిసి గోశాలలోని గోవుల సంరక్షణకు అవసరమైన పశుగ్రాసం (వరిగడ్డి) కొనుగోలుకు రూ.5,225లను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, లయన్స్ సీనియర్ సభ్యులు హారిగే శ్రీనివాస్ (ఎండీఓ), మేకల కార్తీక్, బాలాజీ స్వీట్ హోం సుగునరాం, బొగడమీద శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. గోసేవ చేయడం ద్వారా సమాజంలో మానవత్వం మరింత బలపడుతుందని వక్తలు పేర్కొన్నారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

