సింధు విద్యాలయంలో ఘనంగా ఆంగ్ల దినోత్సవం వేడుకలు

బాన్సువాడ,డిసెంబర్ 31(డిడి9 వార్త):

బాన్సువాడ పట్టణంలోని సింధు విద్యాలయంలో ఇంగ్లీష్ డే వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. వివిధ అంశాలపై వారు ఎంతో ప్రవీణంగా ఇంగ్లీష్‌లో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వినూత్నంగా, ఆకర్షణీయంగా ఉండి అందరి ప్రశంసలు పొందాయి. 8వ తరగతి విద్యార్థులు న్యూస్ రీడర్లుగా వ్యవహరిస్తూ ఆత్మవిశ్వాసంతో వార్తలను చదివారు. 9వ తరగతి విద్యార్థులు రేడియో స్టేషన్ కార్యక్రమం ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి లైవ్ షోను విజయవంతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సానుకూల అభిప్రాయాలను వెల్లడించారు. బాన్సువాడ ప్రాంతంలో ఈ తరహా ఇంగ్లీష్ డే వేడుకలను నిర్వహించిన తొలి పాఠశాలగా సింధు విద్యాలయం ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌మాస్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ,“ఇంగ్లీష్ డే సందర్భంగా మా విద్యార్థులు చూపిన ప్రతిభ నాకు ఎంతో గర్వకారణం. ఈ విజయానికి కారణమైన మా సిబ్బంది కృషి, విద్యార్థుల నిబద్ధత నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమంలో వారు ప్రదర్శించిన ప్రతిభ భవిష్యత్తులో మరిన్ని విజయాలకు దారి తీస్తుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ప్రియాంక, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Views: 43
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు