ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని

బాన్సువాడ, జనవరి 25(డిడి9 వార్త): ఆదివారం భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవం మరియు 16వ జాతీయ ఎన్నికల దినోత్సవం సందర్భంగా బాన్సువాడలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆధ్వర్యంలో, సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు.అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవ హారం ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సందేశం అందించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచడం, ఓటు హక్కు విలువను గుర్తుచేయడం ముఖ్య లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.

Views: 34
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు