బోధన్ గోశాలకు బీర్కూర్,పొతంగల్,కోటగిరి మిత్రబృందం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
బీర్కూర్, మే 10(డిడి9 వార్త)
కొద్ది రోజుల క్రితం బోధన్‌లోని ఏకచక్రేశ్వర గోశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.4 లక్షల విలువైన గడ్డి కట్టలు (పశుగ్రాసం) అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.ఈ ఘటనను తెలుసుకున్న బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు,సామాజిక సేవకుడు,రక్తదాన ఫౌండర్,గోమాత సేవకుడు సితలే రమేష్ వెంటనే స్పందించారు.తమ వాట్సాప్ స్టేటస్ ద్వారా గో సేవకులు మరియు బీర్కూర్,పొతంగల్,కోటగిరి స్నేహితులకు సమాచారం అందించి సహాయం కోరగా వారి సహకారంతో రూ.39 వేల నగదును బోధన్ గోశాల కమిటీకి అందజేశారు.అంతేకాకుండా ఇప్పటి వరకు సుమారు 650 గడ్డి కట్టలను కూడా గోశాలకు పంపించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సేవలను గుర్తిస్తూ బోధన్ ఏకచక్రేశ్వర గోశాల కమిటీ తరపున సితలే రమేష్ ని చిన్నపాటి సన్మానంతో అభినందించారు.ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు నేపాల్ సింగ్ (జీవన్ ఎలక్ట్రికల్స్), గో సేవకులు సురేష్ఈనాని,శ్రీనివాస్,
చరణ్,ఆయిల్ శివ,సోలపూర్ శివ,దత్తు పటేల్,ప్రవీణ్ గౌడ్,సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

