పీఐడీ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా 120 మందికి అన్నదానం
బాన్సువాడ, జూలై 30(డిడి9 వార్త): లయన్స్ క్లబ్ 320డి జిల్లా మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ (పీఐడీ) ఘట్టమనేని బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.బీర్కూర్ మండలానికి చెందిన వికలాంగులతో పాటు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాచకులకు సుమారు 120 మందికి పైగా భోజనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేదలు, వికలాంగులు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగమని తెలిపారు.ఘట్టమనేని బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షులు కుమ్మరి సాయిలు, అహ్మద్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ సీతలే రమేష్, క్లబ్ కార్యదర్శి గాండ్ల సాయికృష్ణ, సీనియర్ లయన్ ఎం.ఏ. రషీద్, కొట్టూరి సంతోష్ సేట్, వీరయ్య సేట్, లయన్స్ సభ్యులు మేరు భరత్, సతీష్ యాదవ్, నగేష్ యాదవ్, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

