బాన్సువాడలో ఉచిత కంటి వైద్య శిబిరం – సామల శ్రీకాంత్ సేవా కార్యక్రమం
బాన్సువాడ,జనవరి 01(డిడి9 వార్త):
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ – 1వ రోడ్ లో యువ నాయకుడు సామల శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.ఈ శిబిరాన్ని ఆయన కుమార్తె సామల సిసిరా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడం విశేషం.ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు ఎంతో ఉపయోగపడే విధంగా నిర్వహించిన ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయగా, పెద్ద ఎత్తున కాలనీ వాసులు, వృద్ధులు, మహిళలు హాజరై తమ కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సలహాలు, మందులు అందజేశారు.ఈ సేవా కార్యక్రమంలో గుడుగుట్ల శ్రీనివాస్, పాయల శంకర్ గౌడ్, తృప్తి శివప్రసాద్, గుడుగుట్ల అనిల్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా యువ నాయకుడు సామల శ్రీకాంత్ మాట్లాడుతూ,“నా కుమార్తె జన్మదినాన్ని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాం” అని అన్నారు.కాలనీ వాసులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ శ్రీకాంత్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

