బరంగ్ ఎడ్గిలో ఉచిత కంటి పరీక్షలు – 37 మందికి మోతిబిందు గుర్తింపు
బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో గురువారం బోధన్ లయన్స్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో మొత్తం 142 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 37 మందికి మోతిబిందు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్స (ఆపరేషన్) కోసం బోధన్‌కు రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో కంటి వైద్య సహాయకులు అజయ్ సర్, రాకేష్ యాదవ్ పాల్గొన్నారు. భీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్, గ్రామ సర్పంచ్ రేంజర్ల అనిల్ కుమార్, లయన్స్ క్లబ్ క్యాంప్ ఇంచార్జ్ హన్మంతు రావ్ పటేల్, లయన్ సభ్యులు కార్తీక్ పటేల్, పంచరెడ్డి అనిల్ కుమార్, పంచాయితీ సెక్రటరీ గురునాథ్, వార్డు సభ్యులు అనిల్, గైని సాయిలు, గ్రామ యువకులు మనోజ్ దేశాయ్, బస్వాంత్ పటేల్, గంగారాం పటేల్, జగం అశోక్, హన్మ గొండ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు.

