తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

పోతంగల్, మార్చి 01 (డిడి9 వార్త): నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని తిరుమలపూర్ గ్రామంలో ఆదివారం స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ అఖిల్, డాక్టర్ ఇర్ఫాన్ రోగులను పరిశీలించి ఉచిత వైద్య సేవలు అందించారు. అవసరమైన ఔషధాలను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరం విజయవంతం కావడానికి హాస్పిటల్ సబ్ స్టాఫ్‌తో పాటు వడ్ల సురేష్ హాస్పిటల్ సిబ్బంది సహకారం అందించారు.ఉచిత సేవలందించిన వైద్యులను సర్పంచ్ బోయి సైదవ్వ, ఉప సర్పంచ్ బెలిగే సంజు కుమార్, వార్డ్ సభ్యులు కాశయ్య, లక్ష్మి, కూనపల్లి నాగేశ్వర్ పటేల్, శివరాజ్ పటేల్ శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, జీపీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 69
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు