మురికి కాలువల శుభ్రతకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు
On
బీర్కూర్, జూన్ 22(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మురికి మట్టి పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కాలువల శుభ్రత పనులను గ్రామ పంచాయతీ పాలకవర్గం చేపట్టింది. గత తొమ్మిది రోజులుగా సర్పంచ్ అనిల్ కుమార్ రెంజర్ల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పరిశుభ్ర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు శివకళ, బుమవ్వ, సాయిలు, గంగవ్వ, బాలేష్, యాదవరావు, అనిల్, హన్మండ్లు, రేణుక, పంచాయతీ సెక్రటరీ గురునాథ్, కరోబారి పర్వయ్య పాల్గొన్నారు.గ్రామంలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని పాలకవర్గం సభ్యులు తెలిపారు.
Views: 227
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

