హావగిర్ రావు దేశ్‌ముఖ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు– కాసుల బాలరాజ్
బీర్కూర్, ఫిబ్రవరి 05(డిడి9 వార్త):
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ వతందార్ హావగిర్ రావు దేశ్‌ముఖ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు.అనారోగ్యంతో బుధవారం హావగిర్ రావు దేశ్‌ముఖ్ మృతి చెందగా, గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా బరంగ్ ఏడ్గి గ్రామాన్ని సందర్శించిన కాసుల బాలరాజ్, మృతునికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హావగిర్ రావు దేశ్‌ముఖ్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష సేవలందించారని, ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడని గుర్తు చేసుకున్నారు. ఆయన కుమారుడు శివ దేశ్‌ముఖ్‌ను ఓదార్చి, ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున సంపూర్ణ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీర్కూర్ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, మాజీ సర్పంచ్ ఇందూర్ లక్ష్మన్, నాయకులు కాదేపురం గంగారాం, గాజుల పండరి, ఇందూర్ గజేందర్, బోయి లాలయ్య, కుమ్మరి గంగారాం, మేత్రి నాగు గొండ, లక్కపల్లి మొగులుగొండ, హట్కరి దశరథ్, చైనాపురం వీరప్ప, మేత్రి బుజ్జి గొండ, శావులం శంకర్, చైనాపురం కామప్ప, నీరడి రాములు తదితరులు పాల్గొన్నారు.

