యోగతో ఆరోగ్యం – బాన్సువాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

బాన్సువాడ, జూన్ 21(డిడి9 వార్త): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడలోని యస్ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆయుష్ విభాగం నిర్వహణలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని తెలిపారు. నేటి ఒత్తిడి జీవనశైలిలో యోగ ఉత్తమ పరిష్కార మార్గమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుశాల్, ఆయుష్ విభాగం వాలంటరీ శ్రీనివాస్ గౌడ్, కాసుల రోహిత్, కాలెక్, గౌస్, మంద ప్రవీణ్ కుమార్, లక్క నరహరి, నర్వ శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో యోగపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Views: 24
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు