పేద కుటుంబానికి చేయూత… పెళ్లికి ఆర్థిక సహాయం
On
బీర్కూర్, ఫిబ్రవరి 26(డిడి9 వార్త): గ్రామానికి చెందిన పేద కుటుంబం తమ్మలి రేఖ గారి కుమార్తె వివాహానికి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించారు.గ్రామంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి తోడుగా నిలిచి, వివాహ కార్యక్రమం సజావుగా జరగేందుకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుండి సహాయం చేస్తుందని తెలిపారు.గ్రామస్థులు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఈ చర్యను అభినందించారు. గ్రామంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
Views: 365
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

