డిపోలో ఇఫ్తార్ విందు
బాన్సువాడ, మార్చి 13 (డిడి9 వార్త):
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపవాసం పాటిస్తున్న ముస్లింలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీఐ మంజుల, హెడ్ గార్డ్ రాజారామ్, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, కార్యదర్శి హఫీజ్, మజీద్, అలావుద్దీన్, సయ్యద్ ఇంతియాజ్, ఇర్ఫాన్, ఫాహీం, రిటైర్డ్ ఉద్యోగులు కౌసర్, మహిమూద్, అలాగే కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

