సీఎం కప్ క్రీడోత్సవాల్లో రెండో స్థానంలో నిలిచిన పోతంగల్ మండల కబడ్డీ ఆటగాళ్లు
On
కోటగిరి / పోతంగల్, ఫిబ్రవరి 07 (డీడీ9 వార్త):
నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శనివారం మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ క్రీడోత్సవాల్లో పోతంగల్ మండల కేంద్రానికి చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా, పోటాపోటీగా పాల్గొన్నారు. ముఖ్యంగా కబడ్డీ పోటీల్లో పోతంగల్ మండల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది.ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ గెలుపు–ఓటములు క్రీడల్లో సహజమని, అయితే గెలుపే లక్ష్యంగా ప్రతి క్రీడాకారుడు తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కప్ పోటీల్లో మంచి స్థానం సాధించడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొని క్రీడోత్సవాలను విజయవంతం చేశారు.
Views: 50
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

