దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణే మా సంకల్పం : కాదేపురం గంగన్న

అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

కోటగిరి, జూన్ 03(డిడి9 వార్త) :
తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్ఎస్‌డబ్ల్యూజేఏ) రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న పేర్కొన్నారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి కోటగిరి మండలానికి చెందిన దళిత జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేసే జర్నలిస్టులకు న్యాయం జరగాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం చిన్న, పెద్ద పత్రికల మధ్య వివక్ష చూపకుండా ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు అందించడంతో పాటు జర్నలిస్టుల పిల్లలకు విద్యలో పూర్తి రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
దళిత, గిరిజన జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని దళిత, గిరిజన జర్నలిస్టులను ఏకం చేసి జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో బేగరి రాములు, రాము, భీంరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 99
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు