ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదలకు నీడ

-ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్

బీర్కూర్, మే 01(డిడి9 వార్త):

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలోని నిరుపేదలకు నీడను అందిస్తోందని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన మూడు ఇందిరమ్మ ఇండ్లకు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న లబ్ధిదారులైన దంపతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారి ఫొటోలతో కూడిన చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, దానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇంకా రెండవ విడతలో మిగిలిఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదేవిదంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సహకారం అందిస్తున్న పోచారం గారికి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బోయి లాలయ్య, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, ఆత్మ కమిటీ సభ్యులు సందుల రవి, మాజీ సర్పంచ్ ఇందూర్ లక్ష్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేపురం గంగన్న, కుమ్మరి గంగారాం, గాజుల పండరి, హొక్నారి అశోక్, ఇందూర్ గజేందర్, మేత్రి నాగుగొండ, చైనాపురం కామప్ప, జంగం బసలింగప్ప, మేత్రి బుజ్జిగొండ, హావగిర్ రావు, పుల్కాంటి హన్ముగొండ, చైనాపురం వీరప్ప, మేత్రి చాందు, నీరడి రాములు, బోయి సాయిలు, చాకలి నాగయ్య, గైని సాయిలు, గాజుల గజేందర్, గైని రాములు తదితరులు పాల్గొన్నారు.

Views: 92
Tags:

About The Author

Related Posts

Latest News

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదలకు నీడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో నిరుపేదలకు నీడ
బీర్కూర్, మే 01(డిడి9 వార్త): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలోని నిరుపేదలకు నీడను అందిస్తోందని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ...
ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవికి ఘన సన్మానం
కుతాడి శంకర్ సేవలు ప్రజలకు ఉపయోగపడాలి – మియాపురం శశికాంత్
పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్
అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష
బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి