బరంగ్ ఏడ్గిలో కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ
On
బీర్కూర్, మార్చి 07(డిడి9 వార్త):
మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో గ్రామానికి చెందిన చాకలి సునీత అనే లబ్ధిదారురాలికి ఐదవ వార్డు సభ్యురాలు ఫుల్కంటి గంగవ్వ శనివారం కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నంత కాలం అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. ఆయన సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేపురం గంగన్న, కుమ్మరి గంగారాం, మేత్రి నాగుగొండ, హట్కారి దశరథ్, క్యాదని లింగప్ప, బోయి లాలయ్య, మొండ్కారి వీరప్ప, సందుల రవి, శావులం శంకర్, హొక్నారి అశోక్, క్యాదని లక్షప్ప, గైని చిన్న సాయిలు, బసప్ప తదితరులు పాల్గొన్నారు.
Views: 71
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

